ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు సహాయం అందించ‌డం ప్రతిఒక్క‌రి సామజిక భాద్యత : గజ్జల యోగానంద్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: స‌మాజంలో ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారికి తోచిన విధంగా స‌హాయం అందించ‌డం ప్ర‌తి ఒక్క‌రి సామాజిక బాధ్య‌త అని శేరిలింగంప‌ల్లి బిజెపి ఇంచార్జ్ గజ్జ‌ల యోగానంద్ అన్నారు. కోవిడ్ కార‌ణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొన్ని కుటుంబాల‌ను వాసవి ఫౌండేష‌న్ ఫ‌ర్ ఎంప‌వ‌ర్ మెంట్ ద్వారా గుర్తించి వారికి మంగ‌ళ‌వారం ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా యోగానంద్ మాట్లాడుతూ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను 3 నెలల పాటు నెలకు రూ 5వేల‌ చొప్పున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్పటివరకూ ఈ కార్య‌క్ర‌మం ద్వారా 120 కుటుంబాలకు ఈ సహాయం అందజేసినట్లు తెలిపారు. కోవిడ్ కష్టాలను మనోబలంతో తిప్పికొట్టవచ్చని, జీవితంలో ఆటుపోట్లు సహజమని ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మరికొందరు బాధితులకు భవిష్యత్తులో కూడా అవసరమైన మేరకు సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయ‌కులు రాజు శెట్టి, గాదె గోపాల్, మారం వెంకట్, సత్య , సత్యనారాయణ గుప్త, రామిరెడ్డి, ఎల్లేష్, రమేష్ సోమిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక స‌హాయం అందజేసిన కుటుంబాల‌తో గ‌జ్జ‌ల యోగానంద్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here