నమస్తే శేరిలింగంపల్లి: టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో ప్రతీ కాలనీలో పచ్చదనం, పరిశుభ్రత మెరుగుపడేలా కృషి చేస్తున్నట్లు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధరరెడ్డి అన్నారు. గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని కేశవనగర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన గంగాధరరెడ్డి జిహెచ్ఎంసి సిబ్బంది, కాలనీవాసులతో కలిసి బస్తీలో కలియతిరిగారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజి, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరు, తాగునీరు, మురికి కాలువలు తదితర సమస్యలను స్థానికులు గంగాధరరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి బస్తీని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పట్టణ ప్రగతి దోహదం చేస్తుందన్నారు. బస్తీలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎమ్ఒహెచ్ డాక్టర్ రవి కుమార్, ఏఈ. కృష్ణ వేణి , వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాధ్, శానిటరీ ఇనస్పెక్టర్ జలెందర్ రెడ్డి, ఎస్ ఆర్ పీ కృష్ణ , జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాందాస్, సీనియర్ నాయకులు శంకర్ యాదవ్, కిషన్ సింగ్, మన్నే రమేష్ , ఈశ్వర, ప్రసాద్, గుండప్ప , రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నానక్ రామ్ గూడాలో అభివృద్ధి పనుల పరశీలించిన కార్పొరేటర్
గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నానాక్ రామ్‌గూడలో జరుగుతున్న భూగర్భడ్రైనేజీ పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ గంగాధరరెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ కృషవేణిలతో కలిసి పరిశీలించారు. నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కాంట్రాక్టర్‌లకు సూచనలు చేశారు. అనంతరం స్థానికులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈ కృషవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, సీనియర్ నాయకులు మీన్ లాల్ , శివ సింగ్, సంతోష్ సింగ్ , ప్రకాష్ సింగ్, రమేష్ , శంకేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.