ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాలి: కార్పొరేట‌ర్ రాగం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి మూడ‌వ ద‌శ కార్య‌క్ర‌మ ల‌క్ష్యాన్ని సాధించేందుకు ప్ర‌భుత్వ సిబ్బంది, ప్ర‌జ‌లు పాటుప‌డాల‌ని శేరిలింగంప‌ల్లి డివిజ‌న్ కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్ అన్నారు. గురువారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని డివిజ‌న్‌ ప‌రిధిలో తారనగర్ పోచమ్మ తల్లి దేవాల‌యం వ‌ద్ద ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాలనీ చెత్త‌చెదారాన్ని పూర్తిగా తొల‌గించి ప‌రిశుభ్రంగా మార్చాల‌న్నారు. డ్రైనేజీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి పున‌రావృతం కాకుండా చూడాల‌ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాస డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రామచందర్, వార్డు మెంబర్ కవిత, డీఈ విశాలక్ష్మీ, ఏఈ అశ్విని, తారనగర్ కమిటీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, నటరాజ్, గోపి,నర్సింహా, విధ్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేష్, ఎస్ఆర్‌పి బాల‌రాజ్‌, ఎస్ఎఫ్ఎ నగేష్, భిక్షపతి, కృష్ణారాజు, శివ కుమార్, దుర్గా భవాని, విద్యా తదితరులు పాల్గొన్నారు.

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్న కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్‌యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here