నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా మార్చి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. శనివారం పట్టణ ప్రగతి మూడవ రోజులో భాగంగా డివిజన్ పరిధిలోని బి కె ఎంక్లేవ్, నాగార్జున ఎంక్లేవ్ లలో చందానగర్ సర్కిల్ ఉప కమీషనర్ సుధాంష్ నందగిరి, స్థానిక నాయకులు, జిహెచ్ఎంసి సిబ్బంది తో కలిసి పరిసర ప్రాంతాలలోని చెత్తను, మట్టి కుప్పలను తొలగించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యలను ప్రజలు వివరించగా ఇంజనీరింగ్ విభాగపు అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా పట్టణ ప్రగతి వంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పది రోజుల పాటు నిర్వహించే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో స్థానికంగా సమస్యలను ఏమైనా ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి నోడల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారు,ఎస్ ఆర్ పి కనకరాజు , ఎస్ ఎఫ్ ఏ లు మరియు సిబ్బంది, జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బంది, కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.