ఇజ్జ‌త్‌న‌గ‌ర్‌ స్మశనవాటిక, దర్గా స్థలాలను వేలం నుండి తొలగించాలి: జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఖానామెట్ స‌ర్వే నెంబ‌రు 41/14 లోగ‌ల స్మ‌శాన‌వాటిక స్థ‌లాన్ని ప్ర‌భుత్వ వేలం నుండి తొల‌గించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ టిఎస్ఐఐసి చైర్మెన్ బ‌లుమ‌ల్లుకు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. బుధ‌వారం బ‌షీర్‌బాగ్‌లోని టిఎస్ఐఐసి కార్యాల‌యంలో చైర్మెన్ ను క‌లిసిన జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ మాట్లాడుతూ ఖానామెట్‌ సర్వే నెంబర్. నందు గత 30సంవత్సరాలుగా ఇజ్జ‌త్‌ నగర్ వీకర్ సెక్షన్ బస్తీలో నివాసముండే ప్రజలు మృతిచెందిన త‌మ కుటుంబ స‌భ్యుల అంత్య క్రియ‌లు అదే స్థ‌లంలో చేప‌డుతున్నార‌ని అన్నారు. స్మశానవాటికతో పాటు గౌసియా అజామ్ దస్తగిర్ దర్గా స్థలం అభివృద్ధికి కృషి తాము చేస్తున్నామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు న్యాయం జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. స్మ‌శాన‌వాటిక‌, ద‌ర్గా స్థ‌లాల‌ను వేలం వేసే స్థ‌లాల జాబితా నుండి తొల‌గించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స‌య్య‌ద్‌ సర్వర్, తైలి కృష్ణ, రంగ స్వామి, సైయ్యద షకీల్, సైయ్యద రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

టిఎస్ఐఐసి చైర్మెన్ బ‌లుమ‌ల్లుకు విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here