త‌ల్లి వ‌ద్ద నుండి ప‌సిబిడ్డ‌ను ఎత్తుకెళ్లింది.. స్నానం చేయించి, పాలు ప‌ట్టి పోలీసుల‌కు అప్ప‌గించింది.

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: రోడ్డుపై కన్న‌త‌ల్లి  ప్ర‌క్క‌నే ఏడుస్తున్న ఐదురోజుల వ‌య‌సున్న ముక్కుప‌చ్చ‌లార‌ని ప‌సిబిడ్డ‌ను చూసిన ఓ మ‌హిళ తల్లికి తెలియ‌కుండా ఎత్తుకెళ్లి స్నానం చేయించి, పాలు తాగించి పోలీసుల‌కు అప్ప‌గించింది. ఈ విచిత్ర‌మైన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… న‌గ‌రంలోని దోమ‌ల‌గూడ ప్రాంతానికి చెందిన వ‌డ్డెజ్యోతి మంగ‌ళ‌వారం మధ్యాహ్నం గంగారంలోని రోడ్డుప్ర‌క్క‌న ఉండే టిఫిన్ సెంట‌ర్‌కు త‌న ఐదు రోజుల ప‌సిబిడ్డ‌తో క‌లిసి వెళ్లింది. అదే స‌మ‌యంలో దాదాపు 25 యేళ్ల వ‌య‌సున్న ఓ మ‌హిళ బిడ్డ‌కు కొత్త‌బ‌ట్ట‌లు ఇప్పిస్తాన‌ని చెప్పి వ‌డ్డె జ్యోతికి అల్పాహారం అందించి బిడ్డ‌ను తీసుకుని వెళ్లిపోయింది. ఎంత‌సేప‌టికీ స‌ద‌రు మ‌హిళ తిరిగి రాక‌పోవ‌డంతో జ్యోతి, భ‌ర్త మ‌ల్లేష్ లు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసులు కిడ్నాప్ గా భావించి విచార‌ణ ప్రారంభించారు. కాగా అమీన్‌పూర్‌కు చెందిన నందిని అనే మ‌హిళ స‌ద‌రు బిడ్డ‌ను ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేయించి, ఆక‌లి తీర్చి పోలీసుల‌కు అప్ప‌గించింది. తాను బిడ్డ‌ను గ‌మ‌నించిన స‌మ‌యంలో జ్యోతి మ‌ద్యం మ‌త్తులో ప‌డి ఉంద‌ని, బాబు ఏడుస్తూ ఉండ‌టంతో త‌న‌కు అనుమానం క‌లిగి అలా చేసిన‌ట్లు నందిని పోలీసుల‌కు తెలిపింది. ప‌సిబిడ్డ విష‌యంలో జాగ్ర‌త్త ధోర‌ణితో ఆలోచించి నందిని వ్య‌వ‌హ‌రించిన తీరును ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here