శేరిలింగంప‌ల్లిలో ద‌ళిత‌, గిరిజ‌న బంధు అమ‌లు చేయాలి: కాంగ్రెస్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళిత బంధు అమ‌లు చేయాల‌ని స్థానిక కాంగ్రెస్ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్టీ సెల్ చైర్మ‌న్ డి.సురేష్ నాయ‌క్ ఆద్వ‌ర్యంలో శేరిలింగంప‌ల్లి త‌హ‌సిల్దార్ వంశీమోహ‌న్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నుల‌కు రూ.10 ల‌క్ష‌ల ఆర్ధిక స‌హాయం అంద‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని కేవ‌ల హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ళిత‌బంధును అమ‌లు చేస్తూ రాష్ట్రంలోని మిగిలిన ద‌ళితుల‌ను విస్మ‌రించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని ద‌ళితులంద‌రికి స‌మానంగా న్యాయం చేయాల‌ని సూచించారు. అదేవిధంగా ద‌ళితుల‌తో పాటు గిరిజ‌నుల‌కు సైతం ద‌ళిత‌బంధు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంప‌ల్లి కో ఆర్డినేట‌ర్ మిట్టు సాయికుమార్‌, ఇన్చార్జీ ర‌ఘునంద‌న్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు మ‌న్నె స‌తీష్‌, జెరిపేటి జైపాల్‌, సురేష్ నాయ‌క్‌, శంక‌ర్‌, రాజ‌న్‌, ల‌తీఫ్‌, జ‌హంగీర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

త‌హ‌సిల్దార్ కార్యాల‌యంలో విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here