గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): జీతాలు రాక అవస్థలు పడుతున్న నర్సరీ సిబ్బంది ఆకలి తీర్చాడు ఓ భాజపా నాయకుడు. వివరాల్లోకి వెళితే తెల్లాపూర్ లోని అర్భన్ నర్సరీలో పనిచేస్తున్న సిబ్బందికి నెలవారీ జీతం రూ.9 వేలు. కాగా గత 3 నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదు. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ బిజెపి నాయకులు మట్ట సురేష్ గౌడ్ శనివారం నర్సరీ వద్దకు వెళ్లి సిబ్బందిని పరామర్శించారు. అధికారులతో మాట్లాడిన ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం 100 కిలోలగు పైగా బియ్యాన్ని సిబ్బందికి పంపిణీ చేశారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ అధికారులు స్పందించి నర్సరీ సిబ్బందికి జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు. నిరుపేదల కడుపు మాడ్చితే ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.