రోడ్డు ప్ర‌మాదంలోనే తండ్రిని, అన్న‌ని కోల్పోయాను..ఈ పొర‌పాటు మీరు చేయ‌కండి :‌జూనియ‌ర్ ఎన్టీఆర్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఎంత జాగ్ర‌త్త‌గా వాహ‌నం న‌డిపిన‌ప్ప‌టికీ ఇత‌రులు చేసిన‌ పొర‌పాట్ల కార‌ణంగా త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ‌, అన్న జాన‌కీరామ్‌ల‌ను రోడ్డు ప్ర‌మాదంలో కోల్పోయామ‌ని సినీ న‌టుడు జూ.ఎన్టీఆర్ అన్నారు. ఒక‌రు నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్ల జ‌రిగే రోడ్డు ప్ర‌మాదాల కార‌ణంగా ఎన్నో అమాయ‌క కుటుంబాలు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున ప‌డుతున్నాయ‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ బాధ్య‌తాయుతంగా న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని హిత‌వు ప‌లికారు.

బుధ‌వారం సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌రేట్‌లో నిర్వ‌హించిన ట్రాఫిక్ పోలీసు విభాగం వార్షిక స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జూ.ఎన్టీఆర్ మాట్లాడ‌తూ ట్రాఫిక్ నియ‌మాలతో, ఉల్లంఘ‌న‌ల‌తో శిక్ష‌లు మ‌నుషుల నిర్ల‌క్ష్య‌పు ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చ‌లేమ‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ‌కు తాము నియ‌మాలు విధించుకుని మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వాహ‌నాలు న‌డిపే స‌మ‌యంలో త‌మ కోసం ఇంటివ‌ద్ద ఎదురుచూసే కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోవాల‌న్నారు. స‌మాజాన్ని స‌న్మార్గంలో న‌డిపేదే పోలీసు వ్య‌వ‌స్థ అని, పోలీసుల‌ను గౌర‌వించ‌డం ప్ర‌తీ పౌరుడి బాధ్య‌తగా భావించాల‌న్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here