
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముంపు ప్రాంతాలలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పర్యటించారు. మొదట న్యూ కాలనీ, ఆ తర్వాత పటాన్చెరువు అవుట్ లెట్ ను ఆయన సందర్శించారు. మా ప్రాంత ప్రజలతో గాంధీ మాట్లాడుతూ ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశామని, పగలంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు ఈఈ చిన్నారెడ్డి, ఏఈ రమేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, వార్డు మెంబర్లు కిరణ్ యాదవ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
