న్యూ పీఏ నగర్ లో మూతలేకుండా ప్రమాదకరంగా దర్శనమిస్తున్న మ్యాన్ హోల్

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పీఏ నగర్ న్యూ కాలనీలో భారీ నాలపై మ్యాన్ హోల్ పై మూతలేకుండా ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. బస్తీవాసులు నిరంతరం రాకపోకలు సాగించే సదరు నాలాపై మ్యాన్ హోల్ తెరిచి ఉండటం పట్ల బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలకు బస్తీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైతే తెరిచి ఉన్న మ్యాన్ హోల్ తో ప్రమాదం పొంచి ఉందని, అధికారులు స్పందించి వెంటనే మూతను ఏర్పాటు చేయీలని స్థానికులు వేడుకుంటున్నారు. కాగా సమస్యను “నమస్తే శేరిలింగంపల్లి” చందానగర్ సర్కిల్ ఏఈ అనురాగ్ మహదేవ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మూతను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

న్యూ పీఏ నగర్ లో మూతలేకుండా ప్రమాదకరంగా దర్శనమిస్తున్న మ్యాన్ హోల్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here