అన్న‌పూర్ణ దేవిగా ద‌ర్శ‌న‌మిచ్చిన చందాన‌గ‌ర్ భ‌వాని మాత

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువైఉన్న శ్రీ భవాని మాత ఆలయంలో దస‌రా నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మూడో రోజు సోమ‌వారం అమ్మవారికి సుప్రభాత హారతి, శ్రీచక్రార్చన, శ్రీచక్రాభిషేకం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారు అన్నపూర్ణ దేవి అవ‌తారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. అమ్మ‌వారిని భ‌క్తులు ద‌ర్శించుకుని తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి, భవాని ఆలయ అర్చకుడు రవిశర్మ, పాలకమండలి సభ్యులు, దేవాలయ సేవాసమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు.

అన్న‌పూర్ణ దేవి అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిస్తున్న అమ్మ‌వారు
అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటున్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here