మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మనకు కలిగే వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురి కాకుండా చూడగలమని సైబరాబాద్ అడీషనల్ ట్రాఫిక్ కమీషనర్ అనిల్‌కుమార్ ఐపిఎస్ అన్నారు. మంగళవారం హైటెక్‌సిటీలోని మెడికవర్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన దంత వైద్య విభాగాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజుల్లో దంత సమస్యలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనం దంత సమస్యలతో పాటు అనేక వ్యాధుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. అనంతరం దంత వైద్యనిపుణులు డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ చాలా మంది పొగ త్రాగడం , గుట్కా నమలడం వల్ల దంతాలకు హాని కలిగిస్తుందని, వీటి వల్ల ఓరల్ కాన్సర్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఆహార అలవాట్ల వల్ల చిన్న వయసు వారిలోనే కాకుండా పెద్దవారిలో కూడా చాలా మందికి దంత సమస్యలతో బాధపడుతున్నారని, అలాంటివారికోసం అధునాతనమైన మెషినరీతో వైద్యసేవలు అందించనున్నట్లు తెలిపారుఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండి డాక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ హరికృష్ణ , గుండె వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ తరితరులు పాల్గొన్నారు
