శేరిలింగంప‌ల్లి గ్రామంలో కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్ యాద‌వ్ ప‌ర్య‌ట‌న‌

న‌మ‌స్తే శేర‌లింగంప‌ల్లి: శేర‌లింగంప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని లింగంప‌ల్లి ఓల్డ్ విలేజ్‌లో స్థానిక కార్పొరేట‌ర్ రాగంనాగేంద‌ర్ యాద‌వ్ మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా స్థానికంగా జ‌రుగుతున్న సి.సి రోడ్లు నిర్మాణ పనులు మరియు డ్రైనేజి పనుల పురోగతిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాగం మాట్లాడుతూ అభివృద్ది ప‌నుల్లో జాప్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. నాణ్యత ప్ర‌మాణాల‌ను తూచ త‌ప్ప‌కుండా పాటించాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి ఓల్డ్ విలేజ్ అధ్యక్షులు గడ్డం రవి యాదవ్, రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర, బృందావనం కాలనీ వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, నాయ‌కులు పట్లోళ్ల నర్సింహా రెడ్డి, నవీన్, మహేష్, ప్రేమ్ చందర్, ఎఈ సునీల్, కాంట్రాక్టర్లు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

స్థానికుల‌తో క‌లిసి అభివృద్ది ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here