మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను ప‌రామ‌ర్శించిన శేరిలింగంప‌ల్లి టిఆర్ఎస్ నాయ‌కులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ‌రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ను శేరిలింగంప‌ల్లి టిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు. శ్రీ‌నివాస్‌గౌడ్ తండ్రి నారాయ‌ణ‌గౌడ్ ఇటీవ‌ల అనారోగ్యం కార‌ణంగా చికిత్స పొందుతూ మృతి చెందిన విష‌యం తెలిసిందే. కాగా మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వ విప్, శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ్యులు ఆరెక‌పూడి గాంధీతో క‌లిసి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని మంత్రి నివాసానికి వెళ్లిన నాయ‌కులు నారాయ‌ణ‌గౌడ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించి, ఆయ‌న‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు వి.జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేష్ గౌడ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , నాయకులు బాక్సర్ గిరి , మిరియాల రాఘవరావు, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.

మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ తండ్రి నారాయ‌ణ‌గౌడ్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పిస్తున్న శేరిలింగంప‌ల్లి టిఆర్ఎస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here