నేతాజీన‌గ‌ర్‌లో వ‌ర‌ద స‌హాయం పంపిణీ

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని నేతాజీ నగర్ కాలనీలో వరద బాధితులకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని బుధ‌వారం కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వ‌ర‌ద బాధితులంద‌రినీ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ పేద‌ల ప‌క్ష‌పాతి అని, ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం జ‌రిగేలా చూస్తార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏఈ కృష్ణ‌వేణి, నేతాజీన‌గ‌ర్ కాల‌నీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్‌, కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, ఆశ బేగం, పద్మమ్మ, విజయ, సత్యమ్మ, జయ రెడ్డి, శారద, దశరథ్ నాయక్, రాజు నాయక్, గణేష్ నాయక్, ప్రసాద్, చారి, రాజు, పంతం శీను, రాజు, రేణుక, రాంబాబు నాయక్, బాల‌రాజ్ సాగర్, శివ కుమార్ పాల్గొన్నారు.

వ‌రద బాధితుల‌కు రూ.10వేలు అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా, భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here