నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో గాంధీ బుణాకర్ మేళ ఆకట్టుకుంటున్నది.
ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఇషా ఫౌండేషన్- ప్రాజెక్ట్ సంస్కృతి బెంగళూరు నుండి విచ్చేసిన కళాకారులూ పద్మాక్ష భూపతి , జనప్రియ మురుగన్ భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. తోడయా మంగళం, రాహుథాష్టకమ్, మొగుడూచి- పదం , తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.