ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి : ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ఇటీవల ఉపాధి లేక ప్రజాభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తగలబెట్టుకున్న విషయం విదితమే. మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా కి చెందిన ఎం. దేవ్లా నాయక్ కుటుంబాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు.

నడిగడ్డ తండా కి చెందిన ఎం. దేవ్లా నాయక్ కుటుంబంతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గాంధీ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ దేవ్లా నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని , ధైర్యంగా ఉండాలని, మనో ధైర్యంతో ముందుకు వెళ్లాలని, పిల్లలను ఆగం చేయకూడదని చెప్పారు. తాము ఉచిత బస్ ప్రయానానికి కు వ్యతిరేకం కాదని , ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కలిపించాలని తెలిపారు.

ఆటో ను పరిశీలిస్తూ…

ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి, ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలి, ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయిందన్నారు. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోందని, అందుకు నిలువెత్తు నిదర్శనమే.. రాష్ట్రంలో రోజు రోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామి నాయక్, హన్మంత్ నాయక్, తిరుపతి నాయక్, గోపి నాయక్, సుధాకర్, కమలాకర్, మోహన్ నాయక్, జితేందర్ నాయక్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here