డివిజన్ అభివృద్ధే ప్రధాన ధ్యేయం

  • కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్ లో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

సీసీ రోడ్డు పనులకు ఇరువైపులా ఉన్న ర్యాంపులను, అరువులను తొలగించి స్థానిక కాలనీవాసుల సౌలభ్యం కోసం రోడ్డు వెడల్పు కోసం ర్యాంపులను, అరువులను తొలగించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. రోడ్డు పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు ఆదేశించారు.

కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను జాప్యం చేయకుండా చూడాలని తెలిపారు. స్థానికులు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని, అప్పుడే పనులు నాణ్యతగా జరుగుతాయని అన్నారు. రోడ్డు నిర్మాణాన్ని కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడితే ఫిర్యాదు చేయాలని ఆయన స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు కేఎన్ రాములు, దాకయ్య గౌడ్, లీలానంద్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, మహేందర్ సింగ్, నర్సింహా, దస్తగిర్, షైక్ రజాక్, నర్సింహా, సురేష్, గఫుర్, రియాజ్, ఉపేందర్, ముసలయ్య, రేణు, సాయి, సర్వేష్, మహిళా నాయకురాళ్లు దివ్య, నిరూప పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here