రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం

  • పదవుల పట్ల స్వార్థం లేని నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీ గెలుపే లక్ష్యంగా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చండూరు గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జి, భూత్ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలతో కలిసి గడపగడపకు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మునుగోడులో కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో కెసిఆర్ ప్రభుత్వం గత 6 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్న వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేశారని, ఎన్నో ఏండ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని అధికారికంగా ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉండడంతో గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టారు. చండూర్ పట్టణ కేంద్రంలో, చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో సిసి రోడ్లు వేశారు. ఆయన త్యాగాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకుని భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించి.. పదవి త్యాగం చేసి మునుగోడు ప్రజల ఆత్మాభిమానం చాటడానికి బరిలో నిలిచిన మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిన ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మ రావు, జిల్లా ఇంచార్జి నాగూరావు రాంజీ, పటాన్ చేరు మాజీ జడ్పీటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్, తిరుపతి సీనియర్ నాయకులు దార్గుపల్లి అనిల్, రంగస్వామి ముదిరాజ్, రాజు, నరేందర్, చండూర్ మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షులు, సోమ శంకర్, స్థానిక నేతలు మాదగోని స్వామి, మన్యం ప్రవీణ్, దోటి శివ, సంగెపు సాయి, సోమ రాజు, గండూరి మల్లేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

చండూరు గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శక్తి కేంద్రం ఇన్ ఛార్జి, భూత్ కమిటీల అధ్యక్షులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here