సైబరాబాద్ లో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

  • పరీక్షా కేంద్రాల వద్ద పట్టిష్ట పోలీస్ బందోబస్తు
  • పరీక్షా కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఇతర పోలీస్ అధికారులతో కలిసి తనిఖీ చేసి అధికారులకు సూచనలు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 121 గ్రూప్ – 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద సీపీ పర్యవేక్షణలో డి‌సి‌పిల నేతృత్వంలో ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు పరీక్షల నిర్వహణకు పటిష్ట బందోబస్తు కల్పించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలను సీపీ సందర్శించి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి బందోబస్తు పై సూచనలు చేశారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొకాపేటలో ఎంజిఐటి కాలేజ్ లోని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తుకు సూచనలు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ప్రిలిమినరీ పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని సీపీ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూసిన అధికారులు, సిబ్బందికి సీపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీపీ వెంట ఆర్డీఓ చంద్రకళ, సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి శ్రీనివాసరావు, ఐపిఎస్., మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మాదాపూర్ ఏడిసిపి నంద్యాల నరసింహారెడ్డి, మాదాపూర్ ఎసిపి రఘునందన్ రావు, మియాపూర్ ఎసిపి కృష్ణ ప్రసాద్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి, నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్, నార్సింగి ట్రాఫిక్ సిఐ మధుసూదన్ రెడ్డి, మియాపూర్ ట్రాఫిక్ సిఐ సుమన్, ఆర్ఐ సురేష్ నాయక్, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు. అయితే శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద వర్షం కారణంగా నిలిచిపోయిన నీటిని చూసి జిహెచ్ఎంసి సిబ్బంది తో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చూస్తానని సీపీ హామీ ఇచ్చారు.

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఇతర పోలీస్ ఉన్నతాధికారులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here