- BLF ఆధ్వర్యంలో హైదరాబాద్
కలెక్టరేట్ వద్ద ధర్నా - ముఖ్యఅతిథిగా హాజరైన BLF చైర్మన్ నల్లా సూర్యప్రకాష్
నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్రవ్యాప్త బిఎల్ఎఫ్ ఆందోళనల పిలుపులో భాగంగా శనివారం హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన మనువాద పాలన కొనసాగిస్తూ ఎస్సీ, ఎస్టీ బీసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అభివృద్ధి జరగకుండా చూస్తుందన్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా బిజెపి ప్రభుత్వం మాదిరిగా బహుజన ప్రజానీకాన్ని అభివృద్ధి చేయకుండా చూస్తుందన్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చూస్తే ఈ రెండు అధికార పార్టీలు కోట్లాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ అధికార పగ్గాలు పట్టాలని చూస్తోందే తప్పా.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి కానివ్వట్లేదని ఆరోపించారు. గత 8 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు అందకుండా అత్యధికంగా నష్టపోయింది బిసిలే అని అన్నారు. స్థానిక సంస్థల్లో 35% రిజర్వేషన్లు ఉంటే వాటిని 25% తగ్గించి గ్రామ స్థాయిలో బిసిల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది టిఆర్ఎస్ ప్రభుత్వంమని ఆరోపించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బిసి వృత్తి కులాల పెఢరేషన్ లకు, ఉమ్మడి బిసి
కార్పోరేషన్ కు నయాపైసా విడుదల చేసిన దాఖలాలు లేవని అన్నారు. దళిత బంధు నిజమైన అర్హులకు ఇవ్వాలి కానీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందులోనూ, ఆర్థిక స్థితిమంతులకు ఇవ్వడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతన్నదనీ ఆయన ని రూపించారు. రాష్ట్ర ప్రభుత్వం బిఎల్ఎఫ్ డిమాండ్ల మీద తక్షణం స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కి అందజేశారు.
- అర్హులైనవారికి డబుల్ బెడ్ రూమ్, బిసి, ఎంబిసి, ఎస్టీ, మైనారిటీ కార్పోరేషన్ లకు వెంటనే విడుదల చేయాలి.
- దళిత బంధు అర్హులైన వారికి ఇవ్వాలి. అనర్హులకు ఇస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.
- సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసున్న వారికి పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాలి.
- అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి
- పేద, మధ్యతరగతి ప్రజల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
- రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లలో మౌలిక వసతులు కల్పన , సొంత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించి, అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులకు నెలనెలా వేతనాలు ఇవ్వాలి.
- వరద ముంపును నివారించాలి. ముంపు ప్రాంతాల్లో బాధితులకు తక్షణం ఆర్థికంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని, తదితర డిమాండ్లతో ధర్నా అనంతరం BLF బృందం హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గౌరవ ఎం.వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ ధర్నా కార్యక్రమానికి బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్య ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరుకాగా రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, మారోజు సునీల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు బి.విమల, పల్లె మురళి, ఇ దసరత్ నాయక్, టి అనిల్ కుమార్, ఏ పుష్ప, వి తుకారాం నాయక్, రంగస్వామి, లలిత, మైదం శెట్టి రాణి, ధారా లక్ష్మి, చందర్, భాస్కరాచారి, దుర్గాప్రసాద్, శ్రీనివాస్, చేన్నమ్మ పాల్గొన్నారు.