చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అకాలంగా కురిసిన వర్షాల కారణంగా వరదకు గురై ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు హోప్ పౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ చేయూతనందించారు. గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లి కి చెందిన మధు , రేణుక, శేరిలింగంపల్లి డివిజన్ కి చెందిన చందులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అకాలంగా కురిసిన వర్షాల కారణంగా వరదకు గురై ఉపాధి కోల్పోయిన వారికీ మేమున్నామంటూ హోప్ ఫౌండేషన్ చేయూతను ఇవ్వడం చాల గొప్ప విషయమని కొనియాడారు. హోప్ పౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ సామజిక కార్యక్రమాలు చేయడం చాల అభినందనీయమని, సమాజము కోసం ఎదో చేయాలనే తపన వలన ఇతరులకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, నాయకులు గంధం రాములు, పీవై రమేష్, మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, ఉమా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.