- అధికారులు, కార్పొరేటర్లు, జీహెచ్ ఎంసీ అధికారులతో కలిసి ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటన
- సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశం
- అత్యవసర పరిస్థితి తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ప్రజలకు పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాలు పొంగి పొర్లి, మురుగు, వరద పెద్ద ఎత్తున పారుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, ప్రతి ఒక్కరు కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు కట్టకు గండి పడింది. ఈ విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలాన్నీ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించారు.
జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వంశీ కృష్ణ, కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో కలిసి వెళ్లి గండి పూడ్చి, కట్ట యథాస్థితికి తీసుకువచ్చి, ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
- చందానగర్ గచ్చిబౌలి డివిజన్ల పరిధిలో
చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీ, శాంతి నగర్, దీప్తి శ్రీ నగర్, కె ఎస్ ఆర్ ఎనక్లేవ్ కాలనీలలో జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వంశీ కృష్ణ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో.. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సాయి వైభవ్, సాయి ఐశ్వర్య కాలనీలలో జీహెచ్ఎంసి అధికారులతో కలిసి ముంపు ప్రాంతలలో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు.
నాలలో కూరుకుపోయిన చెత్త చెదరాంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని, జీహెచ్ ఎంసీ, ఇంజనీరింగ్, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్ అధికారులు ఎస్ఈలు శంకరయ్య, ఆనంద్, ఈ ఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని, నారాయణ, డీఈలు రమేష్, నళిని, డి ఈ విశాలాక్షి, ఏ ఈలు జగదీష్, సంతోష్ రెడ్డి, పావని ఏఎంహెచ్వో కార్తిక్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హఫీజ్పెట్ డివిజన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ. వెంకటేష్, అక్బర్ ఖాన్, రాజశేఖర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, అంజద్,సందీప్ రెడ్డి, శివ ఇతర అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
- కొండాపూర్ డివిజన్ పరిధిలో. .
కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ ప్రధాన రహదారి పై, సిటీ వైన్స్ నుండి డాక్టర్స్ కాలనీకి నాల వద్ద ముంపు ప్రాంతాన్ని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ వంశీ కృష్ణ, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పర్యటించి, పరిశీలించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ప్రజలు వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఈఈ శ్రీకాంతిని, డిఈ రమేష్, డీఈ విశాలాక్షి, ఏ ఈ జగదీష్, ఇతర అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.