నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘాల రిసోర్స్ పర్సన్స్ ప్రతినిధులు పలు సమస్యల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహిళ సంఘాల ఆర్పీ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రతి సమస్య సత్వర పరిష్కారంకు కృషి చేస్తామని , ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానన్నారు.