మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలోగల నాగసాయి మందిరంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, నాయకులు తోపుగొండ మహిపాల్ రెడ్డి లతో పాటు డివిజన్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
