బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలి

  • ఎం.ఎల్.సి కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నం : ఎంపీ రంజిత్ రెడ్డి,
    ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసనసభ్యుడు

నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్.జి.రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీ , మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డి,
ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, బిఆర్ ఎస్ నాయకులు


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో బండి సంజయ్ దిష్టి బొమ్మను మహిళలు చెప్పులతో కొట్టి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేసి, దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం సంజయ్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లాడుతూ.. బిజేపికి రాష్ట్రంలో రోజు రోజుకీ ఆదరణ తగ్గడం తట్టుకోలేక బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని, హద్దు మీరి మాట్లాడే ముందు బండి సంజయ్ ఇంట్లో మహిళలు ఉన్న విషయం మర్చిపోవద్దన్నారు. తన వెనక కేంద్రం సహకారం ఉంది కదా అని నోటికొచ్చింది మాట్లాడుతున్న బండి సంజయ్ కి గుజరాత్ నుండి వచ్చి ఎవరూ కాపాడరని చివరికి తెలంగాణే దిక్కు అని అన్నారు. బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామన్నారు, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బండి సంజయ్ ని తెలంగాణలో ఏ ఒక్క చోట కూడా తిరగనివ్వమని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here