తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జివో నెంబర్ 13ను రద్దు చేయాలి: ఎంసిపిఐయూ

నమస్తే శేరిలింగంపల్లి: ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటిస్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీలను దాటవేస్తూ ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి విడుదల చేసిన జీవో 13 ను రద్దు చేయాలని ఎంసిపిఐయూ నాయకులు డిమాండ్ చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  జీవో నెంబర్ 13 రద్దు చేసి ప్రభుత్వ భూములను ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని, దళితులకు 3 ఎకరాల భూమి పంచాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి తహసిల్దార్, ఆర్డీఓ,  హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వి. తుకారాం నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నివసించడానికి ఇంటి స్థలాలు లేక , సేద్యం చేసుకోవడానికి వ్యవసాయ భూములు లేక లక్షలాది మంది పేద ప్రజలు రోడ్ల ప్లాట్ ఫారాల పై ,చెట్లు కింద , కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తున్నారన్నారు. ఒకే ఇంటిలో మూడుకు మించి కుటుంబాలు సహజీవనం చేస్తున్నాయని, ఇలాంటి దుర్భర జీవితం గడుపుతున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్, దళితులకు గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రగల్బాలు చెప్పి ప్రభుత్వం దగ్గర భూమి లేదని వాయిదా వేస్తుందన్నారు. పేదలకు ఇవ్వడానికి భూమి లేదని బుకాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల వద్ద యున్న భూములను అమ్మాలని కలెక్టర్లకు జీవో నెంబర్ 13 ను విడుదల చేయడం అన్యాయమని తెలిపారు.  దళిత పేద ప్రజలు నమ్మించడం కోసం ఎత్తుగడలు వేస్తూ వారిని మోసం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ భూముల అమ్మకం కోసం తీసుకువచ్చిన జీవో నెంబర్ 13 ను నిలిపివేయాలని లేని పక్షంలో ప్రజలు చేపట్టే ఆందోళన లకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో  గ్రేటర్ కమిటీ నాయకులు పల్లె మురళి, తుడుం పుష్పలత, ఇందిరా, సుల్తానా బేగం, విమల, రజియా బేగం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం సమర్పిస్తున్న ఎంసిపిఐయూ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here