ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు టిఆర్ఎస్ పార్టీ అండ‌గా ఉంటుంది: కార్పొరేట‌ర్లు వి. పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ లు

హ‌ఫీజ్ పేట్‌, మాదాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టిఆర్ఎస్ అధిష్టానం ప్ర‌తీ కార్య‌క‌ర్త‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని హ‌ఫీజ్‌పేట్‌, మాదాపూర్ డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వర్‌గౌడ్‌లు అన్నారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో భాగంగా హ‌ఫీజ్‌పేట్ డివిజన్ ప‌రిధిలోని మ‌దీనాగూడ గ్రామంలో పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథులుగా హాజ‌రైన పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌లు మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఆదేశాల‌తో ప్రారంభ‌మైన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేసేందుకు ప్ర‌తీ కార్య‌క‌ర్త కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షులు వాలా హరీష్ రావు, మదీనగూడా బస్తి అధ్యక్షులు బాల్‌రాజ్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, యాదగిరి ముదిరాజ్, జనార్దన్ గౌడ్, చంద్రశేఖర్, ఆంజనేయులు, వెంకటేష్, రాంబాబు, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, బీరప్ప, బాబు మోహన్ మల్లేష్, సాయి యాదవ్, నవీన్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ కార్య‌క‌ర్త‌లకు స‌భ్య‌త్వ న‌మోదు చేయిస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here