బీజేవైఎం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మల దహనం

గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనత యువ మోర్చ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు నక్క శివకుమార్ ఆధ్వర్యంలో ఖాజాగుడలో ఆదివారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి మూల అనిల్ కుమార్ గౌడ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు నీలం నరేందర్ ముదిరాజ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో హుజుర్ నగర్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేవైఎం నాయకులపై ఈ తెరాస ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, నాయకులు కె వెంకటేష్ గౌడ్, చెట్టి మహేందర్ గౌడ్,శీనుముదిరాజ్, నక్క సామ్రాట్ గౌడ్, శివ శంకర్ గౌడ్, మున్నూరు సాయి, టి సాయి కిరణ్ గౌడ్, నీలం రాఘవేంద్ర, బన్నీ ,కిరణ్ గౌడ్, బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఖాజాగుడలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బిజెపి, బిజేవైఎం నాయకులు

హఫీజ్ పేట్ డివిజన్ బీజేవైఎం ఆధ్వర్యంలో…

మియపూర్ మైత్రి నగర్ కమాన్ వద్ద కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, బీజేపీ జిల్లా నాయకులు రవి గౌడ్, డివిజన్ అధ్యక్షులు మాణిక్యా రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, నాయకులు విజేందర్, ప్రభాకర్, రత్నం, అంజయ్య, సాయిరాం గౌడ్, నందు, వెంకటేష్, సందీప్, ప్రశాంత్, వెంకట్, శ్రీను, శివ, శ్రీకాంత్వి, శాల్ సింగ్, రాజుసింగ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మైత్రీనగర్ కమాన్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బిజెపి, బిజెవైఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here