జోన‌ల్ క‌మిష‌న‌ర్‌తో క‌ల‌సి మ‌ల్కం చెరువు అభివృద్ధి పనులను ప‌రిశీలించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో ఉన్న మల్కమ్ చెరువు అభివృద్ధి పనులను శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌తో క‌ల‌సి స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బుధ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా గంగాధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ రాయ‌దుర్గం ప‌రిస‌ర ప్రాంతాల్లోని క‌లుషిత నీరు, మురుగు నీరు నేరుగా మ‌ల్కం చెరువులో క‌లువ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని జ‌డ్సీని కోరారు. మ‌ల్కం చెరువు అభివృద్ధి పనుల‌కు రూ.1.5 కోట్లు మంజూరు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మ‌ల్కం చెరువు సుంద‌రీక‌ర‌ణ‌తో ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని, పూర్తి ప‌చ్చ‌ద‌నం, వాకింగ్ ట్రాక్‌, బోటింగ్, యోగా హాల్‌, ఐలాండ్, మూత్ర శాల‌లు త‌దిత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఈ శ్రీనివాస్, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

మ‌ల్కం చెరువు వ‌ద్ద అభివృద్ధి ప‌నులపై చ‌ర్చిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి, జ‌డ్సీ ర‌వికిర‌ణ్‌, డీఈ శ్రీనివాస్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here