కొండాపూర్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడిగా అంజ‌నేయులు సాగ‌ర్‌… నియామ‌క ప‌త్రం అంద‌జేసిన జిల్లా అధ్య‌క్షుడు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కొండాపూర్ 104 డివిజన్ భార‌తీయ జ‌న‌త పార్టీ నూతన అధ్యక్షుడిగా అంజ‌య్య‌న‌గ‌ర్‌కు చెందిన ఎం.ఆంజనేయులు సాగర్ నియమితుల‌య్యారు. ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అర్భ‌న్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సామ రంగారెడ్డి, చింత‌కింది గోవ‌ర్ధ‌న్ గౌడ్‌లు బుధ‌వారం నియామక ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆంజ‌నేయులు సాగ‌ర్ మాట్లాడుతూ త‌నపై న‌మ్మ‌క‌ముంచి భాద్య‌త‌లు అప్ప‌గించినందుకు జిల్లా కార్య‌వ‌ర్గానిక ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కొండాపూర్ డివిజ‌న్‌లో పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా స‌మ‌స్య‌ల పోరాటంలో ముందుంటామ‌ని అన్నారు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా శ‌క్తిమేర కృషి చేస్తాన‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, కొండాపూర్ డివిజన్ సీనియర్ నాయకులు మన్యంకొండ సాగర్, ఆత్మారాం బైరాగి, కృష్ణ రామ్ సుతార్ తదితరులు పాల్గొన్నారు.

ఆంజ‌నేయులు సాగ‌ర్‌కు నియామ‌క ప‌త్రం అంద‌జేస్తున్న జిల్లా అధ్య‌క్షుడు కార్య‌ద‌ర్శులు సామ రంగారెడ్డి, చింత‌కింది గోవ‌ర్ధ‌న్‌,గౌడ్‌, ఉపాధ్య‌క్షులు బుచ్చిరెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here