నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్‌ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, నేతాజి నగర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతు వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజి, నీటి సమస్యల పరిష్కారంపై చర్చించారు. స్పందించిన జడ్సీ సదరు సమస్యల పరిష్కారానికి ప్రతిపాధనలు సిద్దం చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఏఈ కృషవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాధ్ రాయదుర్గం, నేతాజి నగర్‌లలో పర్యటిస్తారని సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.