విద్యార్థుల త‌ల్లితండ్రుల ప‌క్ష‌న జిల్లా క‌లెక్ట‌ర్‌కు బిజెవైఎం జిల్లా క‌మిటి విన‌తి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భార‌తీయ జ‌న‌త యువ‌మోర్చ‌ రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాష్ పిలుపు మేర‌కు బిజెవైఎం రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు ఎన్‌.ప‌వ‌న్‌కుమార్ ఆద్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్‌కుమార్‌కు విద్యార్థుల త‌ల్లితండ్రుల ప‌క్షాన ప‌లు డిమాండ్‌ల‌తో విన‌తీ ప‌త్రం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు మారం శ్రీధర్, కుమ్మరి జితేందర్, కార్యదర్శులు జమ్మిశెట్టి సురేష్, పిల్లి సాయి, నాయకులు రాకేష్ యాదవ్ జ‌య‌ సాయి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న జిల్లా బిజెవైఎం నాయ‌కులు
  • బీజేవైఎం డిమాండ్స్‌…
    క‌రోనా సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా తల్లిదండ్రుల ఆర్ధిక ఇబ్బందులు పిల్లల‌పై ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి.
  • పాఠశాల విద్యార్థులకు సరైన దిశ దశ లను చూపుతూ వారిని కాపాడుకోవలసిన బాధ్యత ఈ సమాజం పైన ఉన్నది.
  • కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల పేరు మీద విద్యార్థుల తల్లదండ్రులను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
  • పాఠశాల ఫీజు కనీసం యాభై శాతం వరకు తగ్గించే లా చర్యలు తీసుకోవాలి.
  • అధిక ఫీజులు, ఆన్‌లైన్ క్లాసుల‌ పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న పాఠశాలలపై ఒక ప్రత్యేక కమిటీనీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here