నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ గా నియమితులైన శుభసందర్భంగా ప్రియాంక ఆల ఐఏఎస్ అధికారిణికి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జోనల్ కమిషనర్ ప్రియాంక ఐఏఎస్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన శుభసందర్భంగా ప్రియాంక కు ప్రభుత్వ విప్ గాంధీ మొక్కను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
