నమస్తే శేరిలింగంపల్లి:ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేదలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడే పేద కుటుంబాలు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని 13 మంది బాధిత కుటుంబాలకు రూ. 6.85 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు ఊట్ల చంద్రారెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, పోతుల రాజేందర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.