నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా యువ మోర్చా చేవెళ్ల జోనల్ కో ఇంచార్జీగా తోట్ల భరత్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాష్ చేతుల మీదుగా చేవెళ్ల జోనల్ ఇంచార్జ్ గా తోట్ల భరత్ కుమార్ ను నియమిస్తూ నియామకపు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ బిజెపి సిద్ధాంత, ఆదర్శాలకు అంకితమై నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. సహచర కార్యకర్తలు పార్టీ కమిటీల తో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బిజెపి రాష్ట్ర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.