నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో సందర్శకుల సందడితో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతోంది. ఈ మేళాలో ముత్యాలు, పగడాలు, రాళ్ల ఆభరణాలు, లెదర్ షూస్, చెప్పులు, లాంప్స్, లక్క గాజులు, కొండపల్లి బొమ్మలు, మధుబని, పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, పటచిత్ర పెయింటింగ్స్, తంజావూర్ పెయింటింగ్స్, పెన్ కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, గొంగడి తో తయారు చేసిన శాలువాలు, మడ్ మిర్రర్ వర్క్, కచ్ వర్క్, ట్రైబల్ ఆర్ట్, డ్రై ఫ్లవర్స్ తదితర హస్త కళ ఉత్పత్తులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా తరంగిణి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ పద్మజ విశ్వాస్ శిష్య బృందం చే కర్ణాటక గాత్ర కచేరి లో అన్నమయ్య సంకీర్తనలు నిర్వి, చైతన్య, స్మరణీ, శ్రేయన్షి చే నిర్వహించారు. వయోలిన్ పై గీతాలను, పురందర దశ కీరత్నాలు, లింగాష్టకం అంశాలను తుషార్, మోహిత, సర్వాణి వాయించారు. కీ బోర్డు, గిటార్ పై శివతాండవం, అచ్యుతం కేశవం, ఏకదంతాయ, సాయి భజన అంశాలను ప్రణవ్, శ్రీలస్య, కౌశిక్, రేవంత్, దర్శ ప్రదర్శించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా మూషిక వాహన, దశావతారం, కృష్ణ శబ్దం, ఒకపరి కొకపరి అంశాలను భావిక, నాగశ్రీ, నందిని, ప్రవల్లిక, మాధుర్య, హవిషా, శ్రద్ధ, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.