శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ ఆద్వ‌ర్యంలో ఘ‌నంగా వైఎస్ఆర్ జ‌యంతి

నమస్తే శేరిలింగంపల్లి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆద్వ‌ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.‌ మాదాపూర్‌లోని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో వైఎస్సార్ చేసిన కృషి, పట్టుదల మరవలేనిదన్నారు. అదే స్పూర్తితో భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌తి కార్య‌క‌ర్త ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్య‌ద‌ర్శి కౌషల్ సమీర్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం స‌మ‌న్వ‌యక‌ర్త‌ రఘునందన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి సందీప్ రెడ్డి, ఆయా డివిజన్ల ఇంఛార్జీలు మహిపాల్ యాదవ్, ఇలియాజ్ షరీఫ్, మారెళ్ల శ్రీనివాస్, రేణుక, నగేష్, భరత్ కుమార్, నాయ‌కులు దుర్గం శ్రీహరి గౌడ్, సురేష్, జావేద్, తిరుపతి, రాజన్, ప్రలీత్, సయ్యద్, జగన్ తదితరులు ‌పాల్గొన్నారు.

మాదాపూర్ లో దివంగత నేత‌ వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here