శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. శేరిలింగంపల్లి బిసి ఐక్యవేదిక కార్యాలయం ఎదుట మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, రవి, ఆర్కే రాము, బీసీ నాయకులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ దేశం కోసం మహాత్మా గాంధీ ప్రాణాలర్పించారని అన్నారు. అహింసా సిద్ధాంతంతో ఆయన చూపిన బాటలో నడవాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ చూపిన పోరాట పటిమను నేటి తరం యువతీ యువకులు కలిగి ఉండాలని అన్నారు. యోగా గురువు గారెల వెంకటేష్ ముదిరాజ్, కే నరసింహ యాదవ్, రవి నాయక్, రాయుడు, జయ రెడ్డి, చిట్టెమ్మలాల్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ భువన్ డీజే, నాగరాజు, అశోక్, వేలు, కృష్ణ, జస్వంత్, రాజు, ఆర్కే సాయన్న తదితరులు పాల్గొన్నారు.