శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 34 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలందించిన బి కోకిల ఉద్యోగ విరమణ అభినందన సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడ్డం ప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గడ్డం ప్రసాద్ ని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పదవీ విరమణ చేస్తున్న కోకిలని శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం సాయి బాబాని పాఠశాల సిబ్బంది సత్కరించి మెమొంటో అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్యామల, పాఠశాల సిబ్బంది, వివిధ పాఠశాలల హెడ్మాస్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.