యువ‌త రాజ‌కీయాల్లోకి రావాలి: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రాహుల్ గాంధీయే దేశానికి భరోసా అని, యువత రాజకీయాల్లోకి రావాల‌ని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయ‌న‌కి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఐసీసీ కిసాన్ వింగ్ కో ఆర్డినేటర్, పంజాబ్ రాష్ట్ర మాజీ సీఎం రాజేందర్ కార్ కుమారుడు రాహుల్ సింగ్ సిద్దు ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాల‌న్నారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లోకి వస్తున్నార‌ని, ఇది స్వాగతించాల్సిన విషయమ‌ని అన్నారు. స‌మాజ సేవలో శ్రీ కృష్ణా యూత్ ఎల్లప్పుడూ ముందడుగు వేస్తూ ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే తమ అంతిమ లక్ష్యం అని, శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. గెలుపునకు పొంగిపోయి, ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదని, తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి కర్తవ్యం అని తెలిపారు.

గెలుపోటములకు అతీతంగా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, తమ వద్దకు వచ్చే వారి సమస్యల పరిష్కారానికి తమవంతు ప్రయత్నం ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు స్వామి, నేషనల్ ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రెటరీ శశి బాబు జి, శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజర్ రాజు, సునీల్, భారతి నగర్ డివిజన్ అధ్యక్షుడు గిరి బాబు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, శ్రీ కృష్ణ యూత్ గౌరవ అధ్యక్షుడు యాదగిరి, బాలకృష్ణ, నాయకులు భరత్, జావీద్, కృష్ణ గౌడ్, హేమంత్, లక్ష్మణ్, మనోజ్, భాస్కర్, జయసాయి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here