చందాన‌గ‌ర్‌లో యువ‌తి అదృశ్యం

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ఇంట్లో చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లిన ఓ యువ‌తి అదృశ్య‌మైంది. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్‌లో నివాసం ఉండే గ‌ఫార్ అనే వ్యాపారి కుమార్తె సారానిష‌ద్ (25) ఈ నెల 4వ తేదీన ఉదయం 5.30 గంట‌ల‌కు ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా బ‌య‌టకు వెళ్లింది. అనంత‌రం తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ స‌భ్యులు అన్ని చోట్లా గాలించారు. అయినా ఫ‌లితం లేదు. ఈ క్ర‌మంలో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సారానిష‌ద్ (ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here