మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని బీజేపీ కార్యాలయంలో డివిజన్ బీజేపీ నూతన కమిటీ నాయకులను నియమించారు. డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ అధ్యక్షతన డివిజన్ అధ్యక్షుడు వినయ్ బాబు ఆధ్వర్యంలో నూతన నాయకులను ప్రకటించారు. డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎర్రగుడ్ల మధు యాదవ్, జనరల్ సెక్రటరీగా టీవీ మదనాచారి, ట్రెజరర్ గా వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరీగా గోవర్ధన్ రెడ్డిలను నియమించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జంగయ్యయాదవ్, శ్రీనివాస రెడ్డి, శ్రీశైలం, బీజేవైఎం సీనియర్ నాయకులు హరికృష్ణ, యాదయ్య, శంకర్ నాయక్, డివిజన్ ఉపాధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, నరసింహయాదవ్, వెంకటేష్ బాబు, ప్రధాన కార్యదర్శి శివ, ఓబీసీ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, డివిజన్ సెక్రటరీలు అరవింద్, కొండయ్య, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్, మహిళామోర్చా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, జనరల్ సెక్రటరీ భారతి, స్వప్న రెడ్డి, డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ భాద్యతలు తీసుకొన్నవారు తక్షణమే ఎలాంటి విబేధాలు లేకుండా డివిజన్ కోసం సమయం కేటాయించి పని చేసి పార్టీని బలోపేతం చేయాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు.






