శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): యోగాచార్యలు బృజ్భూషన్ పురోహిత్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నమస్తే యోగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్ లైన్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో https://meet.google.com/hme-avrp-xpo అనే లింక్ ద్వారా ఎవరైనా పాల్గొనవచ్చని, కార్యక్రమంలో పాల్గొనే వారు 10 గ్లాసుల గోరు వెచ్చని నీటితోపాటు క్రియల కోసం క్యాండిల్ లేదా నెయ్యి దీపం తదితర సామగ్రిని వెంట ఉంచుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగా క్రియ పేరిట క్లీనింగ్ ప్రాసెస్, డిటాక్స్తోపాటు ప్రాణాయామం, జపం, జ్యోతి త్రాటక ధ్యానం నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి ఉన్నవారు 8886665690/91 ఫోన్ నంబర్లలో సంప్రదించ వచ్చని సూచించారు.