శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై సైబరాబాద్ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు శనివారం సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా రహదారులపై మార్కింగ్లు, రేడియం స్టిక్కర్ల వెలుగు, జంక్షన్ ల అభివృద్ధి, ఫుట్పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వాటర్ లాగింగ్, డ్రైనేజీ, వాటర్ లీకేజీ సమస్యలు తదితర అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జడ్సీ రవికిరణ్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ వినోద్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్సీసీ లిమిటెడ్, జలమండలి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.