మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టల దొరలూ, ఎరుకల సానిలు ఆటలు పాటలతో సందర్శకులను అలరించారు.
శిల్పారామం యాంఫీ థియేటర్లో నిర్వహించిన కూచిపూడి , కథక్, పేరిణి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రీతుల జుగల్బందీ ప్రదర్శన అలరించింది. గురు శ్రీ రవి బృందం కూచిపూడి నాట్యం, గురు శ్రీ సుబ్రత్ సర్కార్ బృందం కథక్ నృత్య ప్రదర్శన, పేరిణి రవి తేజ పేరిణి తాండవం ప్రదర్శన అలరించాయి. కథక్ లో ధారణ, కృష్ణ వందన, కాళీ వందన, ఫ్యూషన్ అంశాలను, కూచిపూడిలో పుష్పాంజలి, అన్నపూర్ణేయ్, అన్నమయ్య కీర్తనలను కళాకారులు ప్రదర్శించారు.