శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ఎంపీ మందాడి అంజన్ కుమార్ యాదవ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 28వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగరంలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవుల నిరాహార దీక్షను నిర్వహించ తలపెట్టామని అన్నారు. యాదవ హక్కుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ దీక్షకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి యాదవులు భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ యాదవులకు సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మందాడి అంజన్ కుమార్ యాదవ్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, పాములేటి యాదవ్, మధు యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, మరముని శ్రీనివాస్ యాదవ్, అశోక్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.