శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డిని కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్డ్ శాలువాతో సత్కరించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో..
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొమరగౌని సురేష్ గౌడ్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.