శేరిలింగంపల్లి, డిసెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శిల్పారామంలోని ఎథ్నిక్ హాల్‌లో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. మద్దాలి ఉషా గాయత్రి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యంతోపాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూప్ చంద్ బృందం ప్రదర్శించిన నృత్యాలు సందర్శకులను అలరించాయి.